బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షో నుంచి గత వారం రోహిణి ఎలిమినేట్ కాగా… ప్రస్తుతం ఐదో వారం షో కొనసాగుతోంది. ఇప్పుడు హౌజ్ లో 12 మంది సభ్యులు ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈసారి ఎలిమినేషన్‌లో బాబా భాస్కర్, పునర్నవి, మహేష్, హిమజ, అషు, మహేష్, రాహుల్ ఏడుగురు సభ్యులు ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్ బుధవారం రోజు ఆట,పాటలతో సందడిగా మారింది. ఇంటి సభ్యులకి బిగ్ బాస్ టాలెంట్ షో నిర్వహించగా, ఈ షోకి బాబా భాస్కర్, శ్రీముఖిలని జడ్జెస్‌గా నియమించారు. బాగా ప్రదర్శన ఇచ్చిన వారికి ఆపీ ఫిజ్ ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించారు. షోలో మొదటగా పునర్నవి… ‘పిలగా ఇరగ ఇరగ’ అనే సాంగ్‌కి తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసింది. పునర్నవి డ్యాన్స్‌కి జడ్జెస్‌తో పాటు ఇంటి సభ్యులు ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత అషూ రంగంలోకి దిగింది. అయితే తను చిన్నప్పటి నుండి డ్యాన్స్‌కి చాలా దూరం అని, డాన్స్ చేస్తే మమ్మీ డాడీ తిరడతారు అనే భయంతోనే దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది
కాని టాలెంట్‌షోలో అషూ.. జిల్ జిల్ జిల్ జిగేలురాజా సాంగ్‌కి అదిరిపోయేలా డాన్స్ చేసింది. ఆమె డాన్స్‌కి అందరు షాక్ అయ్యారు. బాబా భాస్కర్.. మీ అమ్మనాన్నని ఇంప్రెస్ చేశావో లేదో కాని నన్ను మాత్రం ఫుల్ ఇంప్రెస్ చేశావు అని అన్నారు. ఇక వితికా మంచి మెసేజ్‌తో ఓ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. కళ్ళులేని వాళ్ళకి సాయంగా అందరు నేత్రదానం చేయాలంటూ తెలిపింది. ఇక శివజ్యోతి మాయలు, మంత్రాల గుట్టు విప్పుతానంటూ అగ్గిపెట్టెలో చీర పెట్టే ప్రయత్నం చేసింది. తన గారడీతో అందరిని నవ్వించింది.
హిమజ … ఓ చక్కనోడా సాంగ్ సాంగ్‌ని ఎంచుకుంది. మొదట్లో ఆ సాంగ్ బాగానే పాడిన మధ్యలో లిరిక్స్ మర్చిపోవడం, ట్యూన్ మిస్ చేయడం వంటివి చేసింది. అయితే డ్యాన్సర్, మంచి నటివి అయిన నువ్వు సింగింగ్ టాస్క్ ఎంచుకోవడం అభినందనీయం అని శ్రీముఖి పేర్కొంది. ఇక రాహుల్.. ఏమైపోయావే సాంగ్ మొదలు పెట్టి.. మధ్య మధ్యలో ఆగిపోతాడు. నాకు నర్వస్‌గా ఉంది గివ్ అప్ అనడంతో అంతా షాక్ అవుతారు. నీ వృత్తి పాడడం అలాంటిది గివ్ అప్ అనడం అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఆయన చివరకి పాడతానని స్టేజ్ నుండి కిందకి వచ్చేస్తాడు.
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో తన ప్రయాణాన్ని లింకప్ చేస్తూ బిగ్ బాస్ అంటే ఎవరు.. బిగ్ బాస్ ఎక్కడో ఉండరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు అని చెప్పుకొచ్చాడు మహేష్ విట్టా. బిగ్ బాస్ కి ఓ రూపం లేదా అంటే ఆయనకి రూపం లేదు ప్రతి ఒక్క మనిషిలో ఆయన ఓ అంతరాత్మతా ఉంటారు. మనలో ఉండే కోపం ఆనందంతో పాటు మిగిలిన భావాలు కూడా బిగ్ బాస్. నువ్వు నీ అంతరాత్మతో కలిసి ఆడే ఆటే బిగ్ బాస్. ఒక ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి రెండు గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందరు ఓ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. బిగ్ బాస్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది అని మహేష్ పేర్కొన్నాడు. అయితే మహేష్ నుండి మరింత ఆశించామని శ్రీముఖి తెలిపింది.
ఆ తర్వాత రాహుల్ మరోసారి తన ప్రతిభని చూపించేందుకు స్టేజ్‌పైకి ఎక్కాడు. ఈ సారి పాటని పర్‌ఫెక్ట్‌గా పాడడంతో ఆపి ఫీజ్ బాటిల్ అందించింది శ్రీముఖి. ఇక అలీ రాజా స్వింగ్‌జరా పాటతో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి పిచ్చెక్కించాడు. అమ్మాయిలానే తన హావభావాలు ప్రదర్శిస్తూ చక్కని ప్రదర్శన చేశాడు. మధ్యలో స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి, మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేశాడు. అతని ప్రదర్శనకి మెచ్చిన బాబా అండ్ శ్రీముఖి ఐదారు ఆపీ ఫిజ్ బాటిల్స్‌ని ఆయనకి బహుమతిగా ఇచ్చారు. వరుణ్ సందేశ్ పొడగాటి జుట్టుతో వచ్చి .. ఉండిపోరాదే అంటూ సాంగ్ పాడారు. ఆయన సాంగ్‌కి అందరు ఫిదా అయ్యారు.
32వ ఎపిసోడ్‌లో అలీ రాజా పర్‌ఫార్మెన్స్ ఒక ఎత్తైతే రవికృష్ణ పర్‌ఫార్మెన్స్ మరో ఎత్తు. సగ భాగం అమ్మాయిలా, సగభాగం అబ్బాయిలా రెడీ అయి వచ్చి బ్లాక్ బస్టర్ అనే పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అబ్బాయి,అమ్మాయి రెండు వేరియన్స్ తన బాడీలో చూపిస్తూ అదరహో అనిపించాడు. అతని స్టెప్పులకి బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఫుల్ ఫిదా అయ్యారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా, సందడిగా సాగింది. అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం మొత్తం పర్ఫామర్స్‌లో నలుగురు మాత్రమే సెకండ్ రౌండ్‌కి వెళ్లనున్నారు.