హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకి చెందిన దిల్‌రాజు ప్రొడక్షన్ ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, ZEE 5 కలయికలో రూపొందిన ఒరిజినల్ ATM (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ సమర్పణలో ఎస్.హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వెబ్ సిరీస్ రూపొందుతుంది. ATM వెబ్ సిరీస్‌కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ పద్మ, నిర్మాత హన్షిత, ATM ఢైరెక్టర్ చంద్రమోహన్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా మొదలై సక్సెస్‌లు సాధించిన తర్వాత నెక్ట్స్ ఏంటి? అని అనుకున్నప్పుడు ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా ప్రయాణం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కొత్త వాళ్లని పరిచయం చేస్తూ ఆర్య, బొమ్మరిల్లు, మున్నా.. ఇలా వరుస సినిమాలు చేస్తూ వచ్చాను. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా, సంస్థగా ఎదిగాం. స్టార్స్‌తో, కొత్తవాళ్లతో మంచి సినిమాలను అందిస్తూ ఇక్కడి వరకు ప్రయాణించాం. ఈ స్టేజ్‌లో ఉండటానికి ఎంతో మంది దర్శకులు కృషి ఉంది. ఇలా ప్రతి సినిమాకు ఇది దిల్ రాజుగారి సినిమా అని ప్రతీ సినిమాకు మంచి అంచనాలు పెరగుతూ వచ్చాయి.

