అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ-20లో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్ దెబ్బకు టీం ఇండియా దిమ్మతిరిగే షాక్ తగిలింది. మొదటి టీ20లో ఇంగ్లండ్ జట్టు భారీ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు బావుటా ఎగురవేసింది. టీం ఇండియా విధించిన 125 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది ఇంగ్లండ్. దీంతో టీం ఇండియాకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ విఫలమైన టీం ఇండియా.. ఇటు బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్ కు అడ్డుకట్టవేయలేకపోయింది. కాగా.. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 124/7 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 130/2 పరుగులను కేవలం 15.3 ఓవర్లలోనే చేసింది. ఇంగ్లండ్ బ్యాంటింగ్‌లో రాయ్ 49 పరుగులు, బట్లర్ 28 పరుగులు ఔట్ కాగా.. బెయిర్ స్టో 26 పరుగులు, మలన్ 24 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు.
previous post

