telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ జన్మలో జనగామకు కరువు రాదు..కరెంట్ పోదు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనగామలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నారు.

ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే జనగామకు వచ్చి చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ జన్మలో జనగామకు కరువు రాదు..కరెంట్ పోదు. మూడెకరాల పొలం ఉంటే రైతు కోటీశ్వరుడేన్నారు.

ఏడేళ్ల క్రితం జనగామను చూస్తూ కరువు ప్రాంతంగా ఉండేదన్నారు. ఒక‌ప్పుడు జ‌న‌గామ ప‌రిస్థితి చూస్తే క‌న్నీళ్లు వ‌చ్చేవి అని గుర్తు చేసుకున్నారు.. అప్పట్లో జనగామలో మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితి ఉండేది. చాలామంది పొట్టచేతపట్టుకొని వలసపోయారు. అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డా. రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారింది.

ఇప్పుడు ఇక్కడ రెండు పంటలు పండించుకునే పరిస్థితికి తెచ్చుకున్నామన్నారు. ఒక నాడు కరువు ప్రాంతంగా పేరొందిన జనగామను పూర్తిగా సస్యశ్యామలం చేశామని చెప్పారు.

ఏడేళ్ల క్రితం జనగామలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి రెండు లక్షలుండేది నేడు కోట్లకు చేరుకుందని తెలిపారు. ఇది అభివృద్ధి కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఉద్యోగులు చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు బెంబేలెత్తిపోవ‌ద్దని కేసీఆర్‌ సూచించారు. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. వచ్చిన డబ్బు ఏం చేసుకుంటాం. పనిచేసిన వారికే పంచి పెడతామని ఆయన చెప్పారు.

విద్యుత్‌శాఖ ఉద్యోగులు కరెంట్ కనురెప్పపాటు పోకుండా రేయింబవళ్లూ కష్టపడి విద్యుత్తు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని అన్నారు. 

అధికారుల సహకారంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. జనగామలో ఇలాంటి భవనాన్ని చూడగలుతామని మనం భావించామా? అని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పానన్నారు.

అన్ని రంగాల్లో తెలంగాణలో అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.గోదావరి ఉద్ధృతంగా పారే జిల్లాలో నీటి కొరత చూసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకుని జిల్లాలకు నీళ్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

Related posts