ఒత్తిడిని అధిగమించడం ఎలానో తెలియాలంటే భారత్‌తో ఒకసారి మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పేసర్ జునైద్ ఖాన్ సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లే అత్యంత ఒత్తిడితో కూడుకున్నవని తెలిపాడు. 2012-13లో భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో తనకు ఆ అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నాడు.ఆ సిరీస్‌లో తాను హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచానన్నాడు. ఆ సిరీస్‌లో మొత్తం 8 వికెట్లు తీసిన అతను ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సిరీస్ విశేషాలను పంచుకున్న జునైద్ ఖాన్.. ఒత్తిడిని ఎలా అధిగమించాలో అప్పుడే తెలిసిందన్నాడు. ఆటగాళ్లకు ఒత్తిడిని అధిగమించడం ఎలానో తెలియాలంటే వారు కచ్చితంగా భారత్‌తో మ్యాచ్ ఆడాలి. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌ల్లో ఇరుదేశాల ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు ఈ మ్యాచ్‌లను బాగా ఆస్వాదిస్తారు. కానీ భారత్-పాక్ మధ్య సిరీస్‌లు నిర్వహించాలనే నిర్ణయం పరిపాలకులపై ఆధారపడి ఉంది’అని జునైద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
next post

