telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 20, బుధవారం రాశిఫలాలు..

మేషం
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.

వృషభం
ఆకస్మిక ధనలబ్ధి..పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం
కొత్త వ్యక్తుల పరిచయం..మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు విస్తరిస్తారు..ఉద్యోగాలలో కొన్ని అనుకూల మార్పులు..

కర్కాటకం
అనుకున్న పనుల్లో అవాంతరాలు వ‌స్తాయి. అప్పులు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు.. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహం
ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువిరోధాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్య సూచనలు క‌నిపిస్తున్నాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి ఏర్ప‌డ‌తాయి. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు

కన్య
ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. శుభకార్యాలరీత్యా ఖర్చులు అధ‌. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలలో ఆటంకాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి.

తుల
చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు అదుపు చేయటం కష్టం.

వృశ్చికం
ఈ రోజు ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానాలు స్త్రీలకు సంతోషం కలిగిస్తాయి. రుణబాధలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. పనులలో ఆటంకాలు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు ఎక్కువ‌వుతాయి.

ధనుస్సు
పాత మిత్రుల కలయికతో కొత్త ఉత్సాహానికి గురవుతారు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి.పాత మిత్రుల కలయికతో కొత్త ఉత్సాహానికి గురవుతారు.. అనారోగ్యం. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వ‌స్తాయి.

మకరం
పత్రికా రంగంలోని వారి యత్నాలకు తగు ప్రోత్సాహం లేకపోవటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. బంధువుల‌తో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కుంభం
వాహనం వంటి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. చిత్రమైన సంఘటనలు నెల‌కొంటాయి. ధనలాభాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

మీనం
ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల విమర్శలు తప్పవు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగ రీతా దూరప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.

Related posts