telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్11(సోమ వారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలం. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ కోరికలు తీరతాయి. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులకు కళ్లెం వేయాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. మంచి కాలం నడుస్తోంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో ఆదాయo పెంచుకుంటారు.

మిధునం: రుణం ఒత్తిడి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగుంటుంది. కుటుంబ విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు తగ్గించుకోండి. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ మున్ముందు కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం: నిరుద్యోగులకు అనుకూలం. పాత రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ అనేక పురోగతికి ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి.

కన్య: కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమయం అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలం.

తుల: రాజకీయ, సినీ కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శత్రుపీడ తొలగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. వివాదాలకు పోవద్దు.

వృశ్చికం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలం. పాత సమస్యలు కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు లాభదాయకం. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్థిరాస్తి విషయంలో సమస్య పరిష్కారమవుతుంది.

ధనస్సు: ఆర్థిక విషయంలో పర్వాలేదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. ఇతరులు మీ సహాయం తీసుకుంటారు. కష్టంమీద పనులు పూర్తిచేస్తారు. తోటివారితో సఖ్యతగా ఉండండి.

మకరం: వ్యాపారంలో పురోభివృద్ధి కాన వస్తుంది. మీ పనులకు కొందరు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. పట్టుదలతో ముందుకు వెళ్లండి. ఆప్తుల సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ధైర్యంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. తోటివారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం: ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. పెద్దలను కలుసుకుంటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోధైర్యాన్ని తగ్గకుండా చూసుకోవాలి. శ్రమతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సలహా పాటించండి.

Related posts