telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్‌ 22, సోమ‌వారం రాశి ఫ‌లాలు..

మేషరాశి..

ఆకస్మిక ధనలాభం క‌లుగుతుంది. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కీలక వ్యవహారంలో అనుసరించిన పనితీరును పలువురు మెచ్చుకుంటారు. బంధువులు, సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. వ్య‌వ‌హారాల్లో కీలక నిర్ణయాలు తీస‌కుంటారు.

వృషభరాశి..

కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. కీలక సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. పనుల్లో తోటి వారిని ప్రాధాన్యం ఇస్తే త్వరగా పూర్తవుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి.ఆలయ దర్శనాలు చేస్తారు.

మిథునరాశి..

నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన పనిని ఆచరణలో పెడతారు. ఆర్థిక మార్గాలు పెరుగుతాయి.బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగలాభంక‌లుగుతుంది.

కర్కాటకరాశి..

పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్ప‌డ‌తాయి.

సింహరాశి..

నూతన ఉద్యోగయోగం క‌లుగుతుంది. ఒక శుభవార్త మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు.

కన్యరాశి..

మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

తులరాశి..

ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడ‌తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఒక కీలక పనిని ఎట్టకేలకు పూర్తిచేస్తారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరిచినప్పటికీ.. మనోధైర్యంతో ముందుకు సాగాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. క్షణికావేశం ఇంటికి వంటికి మంచిది కాదు.

వృశ్చికరాశి..

చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విషయాలను పంచుకుంటే మంచిది. ఆలయాలు సంద‌ర్శిస్తారు.

ధనుస్సు రాశి..

విందువినోదాలులో పాల్గొంటారు. ప‌నితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు.

మకర రాశి..

అనవసర వ్యయప్రసాయల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప‌నుల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ధైర్యంతో ముందడుగు వేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. బంధుమిత్రులు, సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి..

రాజకీయరంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ.. ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో ముందుకు సాగితే పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మీన రాశి..

శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిసారిస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబసభ్యులు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్యం బాధ క‌లిగిస్తుంది.

Related posts