telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్ధస్త్” లో రోజా ఇంట్రో సాంగ్స్‌కు డ్యాన్స్ చెయ్యట్లేదు… కారణం…?

Roja

“జబర్ధస్త్” కామెడీ షో ప్రారంభం అయినప్పటి నుంచి నాగబాబుతో కలిసి రోజానే ఈ షోకు జడ్డిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందు వరకు రోజా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేగా కాబట్టి.. ఈ ప్రోగ్రామ్‌లో అనసూయ, రష్మీలకు ధీటుగా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు ముందుగా వచ్చే బీట్ పాటలకు డాన్సులు వేసేది. కానీ నాగబాబు మాత్రం డాన్సులు గట్రా చేయకుండానే కామ్ వచ్చి చైర్‌లో కూర్చునేవాడు. అంతకు ముందు కొన్ని స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లో నాగబాబు కూడా కొన్ని పాటలకు చిందేసిన సంగతి తెలిసిందే కదా. ఇక గత ఎన్నికలపుడు నాగబాబు, రోజాలు తమ పార్టీల తరుపున ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ పడటంతో జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు కాస్తంత విరామం ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రోజా ..వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. నాగబాబు మాత్రం జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత జబర్ధస్త్‌లో మళ్ళీ వీళ్లిద్దరు జడ్జీలుగా రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజాకు జగన్ క్యాబినేట్‌లో బెర్త్ కన్ఫామ్ అనే మాట వినబడ్డప్పటికీ రోజాకు మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు. మరోవైపు జగన్ రెండున్నరేళ్ల తర్వాత చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో మిగిలిన వారికి చోటు కల్పిస్తానని చెప్పడంతో రోజా మంత్రి వర్గ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇక క్యాబినేట్‌లో చోటు దక్కని రోజాకు వై.యస్.జగన్..ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబట్టాడు. అయితే రోజా ఇంతకుముందులా జబర్ధస్త్‌లో వచ్చే ఇంట్రో సాంగ్స్‌కు యాంకర్స్‌తో కలిసి డాన్స్ మాత్రం చేయడం లేదు. క్యాబినేట్ ర్యాంకుతో సమానంగా ఉన్న పదవిలో ఉండటంతో పాటు.. మరో రెండున్నరేళ్ల తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు దాదాపు ఖాయమనే ఉద్దేశ్యంతోనే… కాబోయే మంత్రిగా ఇప్పటి నుంచే హుందాగా ప్రోగ్రామ్‌ను నడిపేలా తనను తాను ప్రిపేర్ చేసుకుంటోంది రోజా… అనే మాటలు విన్పిస్తున్నాయి.

Related posts