telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి తెరపైకి “అర్జున్ రెడ్డి” జంట

Vijay-Devarakonda-and-Shalini-Pandey

విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన “అర్జున్ రెడ్డి” చిత్రం అనూహ్యమైన హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు విజయ్. అయితే షాలిని పాండేను మాత్రం పెద్దగా అవకాశాలు వరించలేదనే చెప్పాలి. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో షాలిని నటించినప్పటికీ అవి పూర్తిస్థాయి పాత్రలు కాదు. ఇటీవల కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “118” చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి కూడా తక్కువే. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంట మరోసారి తెరకెక్కడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా రూపొందనున్న సినిమాతో ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ అనే మలయాళీ నటిని ఎంపిక చేసుకున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్ గా కన్పించనున్నాడని సమాచారం. ఇక విజయ్, షాలినీల మధ్య రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా షాలిని మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

Related posts