telugu navyamedia
సినిమా వార్తలు

మీరు లేకపోవడమే అతిపెద్ద లోటు… మీ కలను మేము నిజం చేస్తాం… : వెంకటేష్

Venkatesh

ఈ ఏడాది సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎఫ్‌-2″తో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి “వెంకీ మామ‌” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే మ‌రో ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌కు వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇక దిగ్గ‌జ నిర్మాత‌, తండ్రి రామానాయుడు జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా వెంక‌టేష్ ఓ అరుదైన ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పొందుప‌రిచారు. చిన్న వ‌యసులో ఉన్న‌ నాగ‌చైత‌న్య‌కు త‌ను కేక్ తినిపిస్తున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫోటోలో రామానాయుడు కూడా ఉన్నారు. “మీరు లేక‌పోవ‌డ‌మే మాకు అతిపెద్ద లోటు. మీ క‌ల‌ను మేం నిజం చేస్తాం నాన్న‌. హ్యాపీ బ‌ర్త్‌డే” అంటూ వెంకీ కామెంట్ చేశారు.

Related posts