telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో అజిత్ కు విలన్ గా కార్తికేయ?

Karthikeya

ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యంగ్ హీరో కార్తికేయ‌. ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ‌ 369, గ్యాంగ్ లీడ‌ర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కార్తికేయ. ఇటీవల కార్తికేయ నటించిన “90ఎం.ఎల్” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. తాజాగా ఈ యంగ్ హీరో మరో స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో మరో సినిమాలో కూడా కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడట. తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో `వాలిమై` చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ఆ పాత్రకు కార్తికేయ సరిగ్గా సరిపోతాడని దర్శకుడు భావించాడట. కార్తికేయ కూడా ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేసినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts