telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం ఎంతో తెలుసా…?

ttd plans to venkanna temples in mumbai and j & K

కరోనా లాక్ డౌన్ తర్వాత నిన్న ఒక్కరోజే అత్యధికంగా తిరుమల శ్రీవారిని 49346 మంది భక్తులు దర్శించుకోగా 18436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దాంతో హుండి ఆదాయం 3.58 కోట్లగా ఉంది. లాక్ డౌన్ అనంతరం శ్రీవారిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం భక్తులుకు ప్రతి నిత్యం 20 వేల టోకేన్లు జారి చేస్తుంది టీటీడీ.  అయితే ఈరోజు నాదనీరాజనం మండపంలో సుందరకాండ అఖండ పారాయణం నిర్వహిస్తుంది టీటీడీ. ఎల్లుండి పౌర్ణమి గరుడ వాహన సేవను నిర్వహిస్తుంది. కోవిడ్ నిభందనలు అనుసరించి ఎల్లుండి నిర్వహించే రామక్రిష్ణ తీర్ద ముక్కోటిని టీటీడీ రద్దు చేసింది. ఇక ఇదిలా ఉంటె… సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పై దుష్ప్రచారం జరుగుతుంది. రాజమండ్రిలో ఇళ్ల పట్టాలు పంపిణీ సమయంలో వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రసంగాని ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తూన్నారంటు పోలిసులుకు ఫిర్యాదు చేసారు టీటీడీ విజిలేన్స్ అధికారులు. అయితే ఈ విషయం పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలిసులు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts