telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

40లలో .. బరువు సమస్యా.. ఇదీ పరిష్కారం..!

tips to over weight issue on 40's

సాధారణంగా వయస్సు పెరిగే కొద్ది అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉండటం సహజమే. ఆ సమస్యలను తగ్గించుకొని ముందుకు సాగితే జీవితం హ్యాపీగా ఉంటుంది. 40 ఏళ్ల వయస్సు వచ్చే సరికి బరువు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. బరువును తగ్గించుకోవటం ఆ వయస్సులో చాలా కష్టం. 40 ఏళ్ల వయస్సులో బరువు తగ్గటం అనేది చాలా కష్టం. ఈ చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.
పండ్లను, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మెటబాలిక్ రేట్ ను పెంచుతాయి. తద్వారా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

వయసు పెరిగేకొద్దీ జీర్ణవ్యవస్థ మందగించడం సహజం, అందుకే తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోమంటారు.. అందుకే తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే తీసుకొన్న ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అయితే డైట్ విషయంలో ఒక్కసారి డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది.

వయస్సు రీత్యా మెటబాలిజంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను తట్టుకోవాలంటే బయట ఆహారాలను మానేసి ఇంటి ఆహారాలను తీసుకోవాలిమెటబాలిజంలో తేడా ఉన్నా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

tips to over weight issue on 40'sముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అసలు మానకూడదు, తప్పనిసరిగా తినాలి. అనుకోని పరిస్థితులలో ఒకవేళ బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ ప్రభావం మెటబాలిజం మీద పడి బరువు పెరిగే అవకాశం ఉంది.

వయసులో ఉన్నప్పటి నుండే వ్యాయామం అలవాటు ఉంటె సరి, లేకపోయినా 40 ఏళ్ల వయస్సు వచ్చే సరికి వ్యాయామం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ప్రతి రోజు 40 నిమిషాల పాటు సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించాలి.

Related posts