telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వయసు మీదపడకుండా.. ఎప్పుడు యవ్వనంగా ఉండాలంటే.. ఇదే దారి..!

tips for being forever young

వయసు పెరుగుతూ ఉంటె ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎవరికైనా నిండు జీవితం యవ్వనంగా ఉండిపోవాలని ఉంటుంది, అది సర్వసాధారణం. ఇంకా చెప్పాలంటే దీనిపై బోలెడన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయంటే అతిశయోక్తి ఏమి కాదు. అందంగా, యవ్వనంగా ఉండాలంటే పరిశోధనల కంటే, భారతదేశంలో గత జీవన విధానం ఒకసారి గమనిస్తే సరిపోతుంది. ఇంకా ఎన్నో ఏళ్ళ క్రితమే భారతదేశ ఆయుర్వేదంలో ఈ శాశ్వత యవ్వనం కోసం మంచి మార్గాలే చెప్పబడ్డాయని నిపుణులు చెపుతూనే ఉన్నారు. అసలు వయసు పెరగకుండా ఉండదు కానీ, దానికి శరీరం పెద్దగా స్పందించకుండా, నిత్యం యవ్వనంగా ఉండేందుకు ప్రముఖ పాత్ర పోషించే వాటిలో ఆహారం కూడా ప్రధానమైనది. అందులోను జ్యూస్ లు తాగటంతో అది సాధ్యం అంటున్నారు నిపుణులు. అలా కాకుండా మార్కెట్ లో లభించే వివిధ క్రిములు వాడుతుంటే, తాత్కాలిక ప్రయోజనం తప్ప శాశ్వత యవ్వనం అసాధ్యమనే అంటున్నారు వారు.

ముఖ్యంగా ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ప్రకృతి నుంచి లభించే సహజ సిద్ధమైన పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటే శరీరానికి ఆరోగ్యమే కాదు, మీ గ్లామర్ కూడా రెట్టింపు అవుతుంది.

ఏ సీజన్‌లో అయినా దొరికే పండు దానిమ్మ పండు. దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దానిమ్మ పండు రసాన్ని రోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులు దరిచేరవు. శరీరంలో వేడి నియంత్రణ అవుతుంది. గ్లామర్ విషయానికొస్తే ఇది మంచి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కిడ్నీలకు, గుండెకు ఎంతో మంచిది ఈ జ్యూస్. అంతేకాదు మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవచ్చు.

Related posts