telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

మూడుపూటలా ఇవే తింటే.. బరువు తగ్గటం అసాధ్యం.. తెలుసా..!

అధిక బరువు ఇదో జబ్బుగా భావిస్తున్నారు అందరూ. అది కూడా ఒక శారీరిక స్థితి. మనం చేసే పని, మన జీన్స్, మన ఆహారం .. ఈ మూడింటిని బట్టి అధికబరువు అనేది సమస్యగా తెరపైకి రావచ్చు. ఈ మూడింటిని గమనించుకోగలిగి, సరైన సమయానికి తగిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే, అందరూ తగ్గ బరువుతోనే ఉండగలరు. ఏ ఒక్కదానిలో అయినా తేడా వస్తే, ఇతరులు మనలను హెచ్చరించేదాకా అధిక బరువు ఉందని కూడా మనకు తెలిసిరాదు. ఇక తెలిశాక చూడాలి.. వీరి వీరంగం.. అన్ని మానేస్తారు. ఆ జాబితాలో ముందు ఉండేది భోజనం. నిజానికి చూస్తే వాళ్ళు భోజనం రెండు మూడురోజులకు ఒకసారి చేస్తుంటారు. మరి మిగిలిన సమయాలలో .. అంటారా.. ఏముంది రోడ్డుమీద ఏది దొరికితే అది.. అంటే పై తిండి ఎక్కువ.. అదే అసలు తిప్పలు తెచ్చేది. కడుపులో ఎంత వేస్తున్నాం, ఏమి వేస్తున్నాం .. లెక్కాపత్రం లేకుండా వేసేస్తుంటారు. తీరా బరువు పెరిగిపోతున్నాం.. అని తెలుసుకోగానే.. భోజనం కట్ అంటుంటారు. అసలు తినని దానిని వదులుకుంటారు.. గాని, ఇష్టమైంది ఎవరు వొదులు కుంటారు.. అందుకే ముందు లిస్ట్ లో భోజనం మానేస్తున్నాం.. అని ఉంటుంది.

చాలామంది బరువు తగ్గడానికి అనుసరించే విధానం ఇదే.కొందరు పొద్దస్తమానం టీ,కాఫీల మీదనే ఆధారపడతారు. దాని ద్వారా ఆకలి చచ్చిపోయి తినడం తగ్గించి బరువుతగ్గాలనే ఆలోచన కొందరిది. కానీ టీ,టిఫిన్స్ వలన మీకు తెలియకుండానే మీ శరీరానికి పెద్ద నష్టం చేసుకుంటున్నారు.

these items taking 3 times in a day is not healthyఇడ్లీ, దోస, వడ లాంటి టిఫిన్స్ డెయిలి తినడం వలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పాత కాలంలో మన పెద్దలు అయితే పొద్దుగాల్నే శరీరానికి మంచి పోషకాలను, కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు. అందులో పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివెన్నో పోషకాల పరంగా వెలకట్టలేని ఆహారాలున్నాయి. ఎక్కడినుండి ప్రారంభం అయిందో కానీ, ఆ తర్వాత అందరూ మూడు పూటలా అన్నం తినడం అలవాటు పడ్డారు.

అందుకే లేవగానే బెడ్ కాఫీ, ఉదయాన్నే టిఫిన్లు మధ్యాహ్నం అన్నం, రాత్రి కి అల్పాహారం పేరుతో మళ్లీ టిఫిన్లు తినడం చేస్తున్నారు. మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లీ మంచిదే కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి…ఇలా అన్నింటిని కలిపి తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది.

బియ్యం కంటే మినప్పప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి షుగర్ ను పెంచుతాయి. ప్రతిరోజూ టిఫిన్స్ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. వాత వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా వంటి టిఫిన్లు దీర్ఘకాలంగా అంటే పది పదిహేనేళ్లుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చేస్తోందట. కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లకే టిఫిన్స్ ని పరిమితం చేయాలి.

these items taking 3 times in a day is not healthyశ్రేష్టమైనది అంటే, ఉదయం వేళ పెరుగన్నం, ఇంకా రాత్రి మిగిల్చిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకుని మార్నింగ్ తినడం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పును గమనించొచ్చు. అలాగే మద్యాహ్నానికి బిర్రుగా కడుపునిండా తినాలి.

ఉపవాసం పేరుతో కొంతమంది రాత్రి వేళ అన్నం మానివేస్తారు. అటువంటి అలవాట్లు ఉన్నవాళ్లు తిరిగి ఆ సమయంలో ఇడ్లీ, దోశ, బోండాలు, చపాతి, పరోటాలు వంటివి లాగిస్తుంటారు. అలా చేయడం వల్ల సాధారణంగా అన్నం తిన్నదానికంటే ఎక్కువే శరీరానికి నష్టం. అలాగే నైట్ కూడా తేలికగా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Related posts