telugu navyamedia
ఆరోగ్యం

భోజనం తరువాత.. ఇలాంటి పనులు.. తూచ్..!!

బొజ్జ నిండా ఇష్టమైన భోజనం చేశాక కూడా కొసరు మాదిరి కొన్ని చేస్తుంటారు. కానీ అలాంటివి సరి కాదని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు, మంచి పోషకాహారం తీసుకున్నాం అనుకుని.. ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు కారణంగా ఆరోగ్యానికి హానికలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకక తప్పదు.. అవేంటంటే.. 
*  భోజనం తిన్న వెంటనే టీ తాగితే జీర్ణమవదు. తద్వారా తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 
*  భోజనం చేసే ముందు.. లేదా చేశాక పండ్లు తినకూడదు. ఇలా తినడం వలన పొట్ట పెరుగుతుంది. కనుక రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
*  కొందరైతే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వలన కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివలన పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
*  అన్నం తిన్నాక అరవై అడుగులు వేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని చెప్తుంటారు. కానీ భోజనం చేయగానే నడిస్తే పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తప్పదనుకుంటే గంట తరువాత నడవండి. 
*  భోజనం తినగానే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

Related posts