telugu navyamedia
andhra crime news Telangana trending

ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న పాస్వర్డ్స్ ఇవే..

చెత్త పాస్వర్డ్ ల జాబితాను పాస్వర్డ్ మేనేజర్ నార్డ్ పాస్ 2020 సంవత్సరపు వెల్లడించింది. ఆ పాస్వర్డ్ లను 12 రకాలుగా వర్గీకరించారు. 2020 లో 200 చెత్త పాస్‌వర్డ్‌లను నార్డ్‌పాస్ ఒక జాబితా విడుదల చేసింది. మీరు ‘123456’ని పాస్ వర్డ్ గా పెట్టుకున్నారా? అయితే వెంటనే ఆ పాస్ వర్డ్ మార్చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇంటర్నెట్ లో ఎక్కువగా వినియోగించబడే అతి తేలికైన పాస్ వర్డ్ లలో ఇదొకటి అని తేలింది. ఇదొక్కటే కాదు పేర్లు, ఆటల జట్లు, ఊతపదాలు, వీటన్నిటికీ వాడే కోడ్ ల వంటివన్నీ మీరనుకుంటున్న దాని కంటే ఎక్కువ పాపులర్ అయినందువల్ల ఇలాంటి పాస్ వర్డ్ లను అతి తేలికగా హ్యాక్ చేసేయొచ్చని అంటున్నారు. కోట్లాది అకౌంట్ల పాస్ వర్డ్ లను విశ్లేషించి చొరబాటుకు చాలా తేలికగా ఉండే పాస్ వర్డ్ జాబితాను తయారు చేసింది ఈ నార్డ్ పాస్. ఆ తరువాతి స్థానంలో 123456789 ఎక్కవ వాడే పాస్ వర్డ్ గా గుర్తించారు. picture1 అనే పాస్ వర్డ్ కూడా ఎక్కువగా వాడుతున్నట్టు గుర్తించారు. “123456” అత్యంత ఎక్కువగా ఉపయోగించే పాస్ వర్డ్ గా తేలింది. 23.2 మిలియన్ సార్లు ఈ పాస్ వర్డ్ ను ఉపయోగిస్తున్నారట. “123456789” పాస్ వర్డ్ ను 7.7 మిలియన్ల మంది వినియోగిస్తున్నారట. 10  మోస్ట్‌ కామన్‌ పాస్‌వర్డ్‌లు123456, 123456789, పిక్చర్ 1, పాస్‌వర్డ్‌, 12345678, 111111, 123123, 12345, 1234567890, సెన్హా చాలా మంది తాము ఎక్కువగా ఉపయోగించే ఊత పదాలను పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి సులువుగా చొరబడగల పాస్ వర్డ్ లకు బదులుగా మూడు అతి తక్కువగా వాడే, గుర్తుంచుకోదగ్గ పదాలతో పాస్ వర్డ్ పెట్టుకోవాలని నార్డ్ పాస్ సూచింది. అలాగే ఉపయోగించిన పాస్ వర్డ్ ను తిరిగి వాడటం చాలా రిస్క్ అని తెలిపింది. కాబట్టి అందరూ తమ పాస్వర్డ్ లను జాగ్రత్తగా పెట్టుకోండి.

Related posts

2019 ప్రపంచ కప్ : .. ఇంగ్లాండ్ అనూహ్య ఓటమి…

vimala p

అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

vimala p

విశాఖలో పులివెందుల పంచాయితీలు: దేవినేని ఉమా

vimala p