ప్రపంచవ్యాప్తంగా భారీ యాక్షన్ చిత్రం “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ కు ఉన్న అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఎనిమిది చిత్రాలు వచ్చి భారీ కలెక్షన్లను కొల్లగొట్టగా… తాజాగా ఇప్పుడు తొమ్మిదో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాసన్ స్టాథమ్, డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు డేవిడ్ లిచ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ కు “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: హాబ్స్ అండ్ షా” టైటిల్‌ను ఖరారు చేశారు. స్ట్రీట్ రేసింగ్ నేపథ్యంతో యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమాలో హాబ్స్ అనే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా డ్వెయిన్, మాజీ మిలిటరీ అధికారి షా పాత్రలో జేసన్ నటించారు. ఇడ్రిస్ ఎల్బా సైబర్ ఎనార్కిస్ట్‌గా విలన్ పాత్రను పోషించారు. “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ నుంచి వచ్చిన ఎనిమిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టాయి. ఈ సినిమాను భారత్‌లో పది భాషల్లో విడుదల చేయబోతుంది యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సంస్థ. దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బోజ్‌పూరీ, పంజాబీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.