telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వరదలకు .. నీళ్లతో కళకళలాడుతున్న ప్రాజెక్టులు..

telangana water projects with full flow

ఎగువ రాష్ట్రాలలో భారీవర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది. దీనితో ఆయా ప్రాజెక్టులు నీటితో నిండుకుండలా కళకళలాడుతున్నాయి. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలోని పెద్దమిడిసిలేరు గ్రామం వద్ద ఉన్న మధ్యతరహా సాగునీటి తాలిపేరు ప్రాజెక్టులో శుక్రవారం 7 గేట్లు ఎత్తి 35,427 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 38,540 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా డ్యామ్‌లో 72.25 మీటర్ల నీటిని నిల్వచేసి మిగిలిన నీటిని గేట్లు ఎత్తి కిందకు వదిలేస్తున్నట్లు తాలిపేరు ప్రాజెక్టు ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఉదయం 16 మిమీ వర్షపాతం నమోదైంది. ఇటీవల జోరుగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టు ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీటిని నిలుపుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతులు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు.

Related posts