telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ శుభవార్త

students masks exams

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  ప్రతిరోజూ వేయికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా విద్యార్థుల పై పడుతోంది. కేసులు పెరగడంతో ఇప్పటికే… విద్యాసంస్థలను మూసివేసింది ప్రభుత్వం. అయితే.. తాజాగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చదివే పాఠశాలలకు పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండకుండా చర్యలు తీసుకుంటుంది. విద్యార్థి చదివే పాఠశాలలకు కనీసం 5 కిమీ పరిధిలోనే పరీక్ష కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. గతంలో విద్యార్థి చదివిన పాఠశాలకు గరిష్ఠంగా 8 కిమీ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉండేవి. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 5 కిమీ పరిధిలోనే ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సదుపాయాలు ఉన్న స్కూళ్లు లేదా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీలను సైతం సెంటర్లుగా వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. గతంలో పరీక్ష కేంద్రాల్లో ఒక్కో గదిలో 20 నుంచి 22 మంది విద్యార్థులను కేటాయించేవారు. అయితే.. ఈ సారి మాత్రం ఒక్కో గదికి 10-12 మంది విద్యార్థులను కేటాయించనున్నారు. దీంతో అదనంగా మరో 2 వేలలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Related posts