telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొత్తగా 2,479 కొవిడ్ కేసులు

Corona

తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,479 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు పెరిగింది.

నిన్న ఒక్క రోజే కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 916కు పెరిగింది. గత 24 గంటల్లో 62,649 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 18,90,554కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు 1,15,072 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 31,654 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Related posts