telugu navyamedia
andhra news political

రుణమాఫీ జీవో రద్దుపై సోమిరెడ్డి ఆగ్రహం

somireddy brother into ycp today

రైతు రుణమాఫీ కోసం ఉద్దేశించిన జీవో 38ను వైసీపీ సర్కారు రద్దు చేయడంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకం రద్దు విషయంలోనూ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన విమర్శించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే వాళ్ల గొంతులు కోస్తారా? అని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ కోసం ఉద్దేశించిన జీవో 38ను రద్దు చేయడం దారుణమని అన్నారు. న్యాయస్థానాల తీర్పులను కూడా ఉల్లంఘించే పరిస్థితి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. పీపీఏలు, పోలవరం వంటి విషయాల్లో అయోమయం నెలకొందని అన్నారు. ఇవాళ కేంద్రమంత్రి ఇచ్చిన వివరణ ఈ ప్రభుత్వం తీరును ఎండగడుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు కేంద్రానికి రాసిన లేఖలకు కేంద్రమంత్రి స్పష్టంగా సమాధానమిచ్చారని తెలిపారు.

Related posts

చంద్రబాబు విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులు: మంత్రి బొత్స

vimala p

ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి: మంత్రి తలసాని

vimala p

లక్ష్మణ్ దీక్షను విరమింపజేసిన కేంద్ర మంత్రి

ashok