telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఎన్టీయార్ కొమరం భీమ్ అవతారం .. ఆక్టోబర్ 22న .. సిద్ధంగా ఉండాలి..

tarak look as komaram bheem on oct 22

జక్కన రాజమౌళి బిజీగా చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ విషయంలో ఒక్కటి కూడా న్యూస్ బయటపెట్టకుండా అలా సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు రాజమౌళి. ఈ మూవీలో ఉన్న ఇద్దరు హీరోలు జమా జెట్టీల లాంటి వారు. ఒకరు ఎన్టీయార్, మరొకరు రామ్ చరణ్. ఈ ఇద్దరితో జక్కన్న చెక్కుతున్న శిల్పం వచ్చిందంటే ఆర్ ఆర్ ఆర్ యూనిటే ఆ మాట చెప్పాలి. బాహుబలితో తెలుగు సినిమా స్టామినాను, పొటెన్షియాలిటీని పెంచేసిన రాజమౌళి జాతీయ అంతర్జాతీయ కాన్వాస్ మీద తెలుగు మూవీని పరచేశాడు. రాజమౌళి పెట్టిన ఎత్తులకు ఎక్కలేక ఓవైపు టాలీవుడ్ సతమవుతూంటే ఆయన మాత్రం సైలెంట్ గా ఆర్ ఆర్ ఆర్ అంటున్నారు.

మరి ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ ఇంటెరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఆయన జయంతి అక్టోబర్ 22. దాంతో ఆ రోజున కొమరం భీం గెటప్ లో ఉన్న ఎన్టీయార్ స్టిల్ ఒకటి రిలీజ్ చేస్తారని ఇప్పటికి అందుతున్న సమాచారం. ఇది నిజంగా జూనియర్ అభిమానులకు పండుగలాంటి వార్తే. కొమరం భీమ్ గా తమ హీరో ఎలా ఉంటాడోనని ఇప్పటికే వూహించేసుకుంటున్న వారికి ఈ స్టిల్ విడుదలతో మరింత ఇంటెరెస్ట్ పెరిగిపోవడం ఖాయం. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ మూవీని 2020 సమ్మర్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Related posts