telugu navyamedia
సినిమా వార్తలు

వెండితెరపై కరీనా కపూర్ తనయుడు

TAimur-Ali-Khan

బాలీవుడ్ సెలబ్రిటీ జంట కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ కు బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందంటే… తైమూర్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొన్ని గంటల్లోనే లక్షల లైకులు, షేర్లతో వైరల్ గా మారిపోతాయి. అంతేకాదు బయట ఎక్కడైనా కన్పిస్తే చాలు మీడియా కెమెరాలు క్లిక్ మనాల్సిందే. తైమూర్ తనకున్న ఉన్న పాపులారిటీతో ఇప్పుడు వెండితెరపై కన్పించి అభిమానులను కలుసుకోబోతున్నాడు. అంటే ఈ రెండేళ్ల క్యూట్ స్టార్ త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నాడన్నమాట. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం కరీనా కపూర్ నటిస్తున్న “గుడ్ న్యూస్”లో తైమూర్ 10 నిమిషాల పాటు కనిపించనున్నాడు. ఈ సినిమాలో తైమూర్ కోసం రెండు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కరీనాతో పాటు అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, దిల్జీత్ దోశాంఝాతదితరులు నటిస్తున్నారు. అంటే తైమూర్ రెండేళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడన్నమాట.

Related posts