telugu navyamedia
సినిమా వార్తలు

“భారతీయుడు-2” : కమల్ కు సమానంగా అక్షయ్

bharatiyudu2 movie shoot in Ukraine
విలక్షణ నటుడు, అద్భుత దర్శకుడు కలిస్తే వచ్చే చిత్రాలను గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అవి చూస్తే మరో ప్రపంచానికి వెళ్లి వచ్చినట్టే ఉంటుంది. అలాంటి అరుదైన కలయికలు కూడా చాలా తక్కువే అని చెప్పవచ్చు. ప్రస్తుతం అలాంటి కలయికతో మరో చిత్రం తెరకెక్కించే ప్రయత్నాలు ప్రారంభం అవుతున్నాయి. దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ నటించనుంది. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరిగిపోతున్నాయి. కథ ప్రకారం సినిమాలో ఓ కీలకపాత్ర కోసం ముందుగా అజయ్ దేవగన్ ని ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అజయ్ కి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.
దీంతో అతడి స్థానంలో అక్షయ్ కుమార్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. శంకర్ అడిగిన వెంటనే అక్షయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. సినిమాలో ఆయన పాత్ర కమల్ తో సమానంగా ఉంటుందని సమాచారం. కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను స్థానికంగానే ప్రణాళిక వేసినట్టు తెలుస్తుంది. అనంతరం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ‘పొల్లాచ్చి’లో చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్ ను ‘ఉక్రెయిన్’లో చేయాలనీ నిర్ణయించారట.
ఇది మేజర్ షెడ్యూల్… ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తారట. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా కోసం కమల్ హాసన్ అప్పుడే వర్క్ అవుట్ కూడా మొదలుపెట్టారట, కొత్తగా కనిపించాలనే ఆయన ఆశకు అంతెక్కడిది చెప్పండి… ఈ చిత్రంలో ఇంకెంత కొత్తగా కనిపిస్తారో వేచి చూడాలి. ఏమంటే ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని  అందిస్తున్నారు. 

Related posts