telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ ఫ్యాన్స్ కు సుమ కౌంటర్

Suma

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ సుమ… ఆమె వేసే కౌంటర్లు, పంచ్ లు అందరినీ నవ్విస్తాయి. సుమ తన మాటల చాకచక్యంతో ఎవ్వరినీ నొప్పించకుండా నేర్పుగా కార్యక్రమం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే సుమ అంటే అందరికి అభిమానం. ఇక మహేష్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి హాజరైన కొంతమంది అభిమానులు ఈవెంట్ లో లైట్స్ స్టాండ్స్, అలాగే ఫ్లడ్ లైట్స్ స్తంభాలను, బారికేడ్ల వంటి వాటిని లెక్క చేయకుండా పైకి ఎక్కుతూ ఉండడంతో సుమ వారిని సున్నితంగా వారించే ప్రయత్నం చేశారు. మాకు తెలుసు మీరందరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకుంటూ ఉంటారని, కానీ ఇలా ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు అలా ఎత్తులకు ఎక్కకూడదమ్మా.. అది మీకే కాదు.. చుట్టూ పక్కల ఉన్నవారికి కూడా ప్రమాదం. కాబట్టి మీరు ఎక్కిన ఆ ఎత్తుల నుంచి దిగవల్సిందిగా సభా ముఖంగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీ ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న అక్కా చెల్లి అందరూ మీ కోసం ఎదురుచూస్తుంటారు… సో పండుగాళ్లందరూ దిగండమ్మా అంటూ సుమ స్వీట్ కౌంటర్ ఇచ్చారు.

Related posts