telugu navyamedia
సినిమా వార్తలు

సుడిగుండం..

kalala rani poetry corner
నాకు తెలుసు,
ఈ వేళలో నీవు ….
మన గతజ్ఞాపకాల పందిరిలో ,
పరువం అందిపుచ్చుకున్న ,
పెళ్లి కూతురులా,
సింహావలోకన సుందరివై ,
శయన మందిరంలో ..
సేద తీర్చుకుంటూ ఉంటావని !
నువ్వూ ..నేనూ ..
ప్రేమ దొంగలమై …
ఒకరినొకరు దోచుకుని,
దాచుకున్న ప్రేమపత్రాలను,
ఒక్కొక్కటిగా ….
స్కానింగ్ చేస్తూ ఉంటావని !
నాకు తెలుసు ,
నువ్విప్పుడు ,
ఛిద్రమై 
చేజారిపోయిన 
ప్రేమ శకలాలు ఏరుకుని,
గుండె గుడిలో …
దాచుకునే ప్రయత్నం _
చేస్తుంటావని …!
నాకు తెలుసు ,
నువ్విప్పుడు,
ఆశా ..నిరాశల 
సుడిగుండం లో …
చిక్కుకుని,
నిస్సహాయ స్థితిలో ,
దిక్కులు చూస్తూ కూర్చుంటావని !
-డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
    హనంకొండ

Related posts