telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా శ్రీవిష్ణు “తిప్పరా మీసం” ట్రైలర్

TM

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న “తిప్పరా మీసం” సినిమా నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ యాక్షన్ డ్రామాను ఎల్.కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ‘తిప్పరా మీసం’ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తిప్పరా మీసం తెలుగు రాష్ట్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్‌కు సొంత చేసుకున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్‌లో శ్రీవిష్ణు సీన్స్‌ అన్ని సెన్సేషనల్‌ హిట్‌ అర్జున్‌ రెడ్డిని గుర్తుచేసేలా ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ పాత్రను ఏ షేడ్స్‌లో అయితే డిజైన్‌ చేశారో దాదాపు శ్రీ విష్ణు పాత్ర కూడా అదే తరహాలో ఉంది. డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి కథే తిప్పరామీసం. అయితే ఈ సినిమాలో రోహిణి, శ్రీవిష్ణుల మధ్య వచ్చే మదర్‌ సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts