telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

దొంగతనానికి వచ్చి ఎటిఎం లోపలే ఇరుక్కుపోయిన దొంగ… చివరకు ఇలా…!

Thief

చైనాలో ఇటీవల ఓ ఏటీఎంలోని డబ్బును దొంగిలించాలనుకున్న ఓ దొంగ ఏటీఎం రూం లోపలే ఇరుక్కుపోయాడు. చైనాలోని షాండాంగ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే.. దొంగ ఏటీఎంలోకి ప్రవేశించిన వెంటనే ఓ వాయిస్ మెసేజ్ స్పీకర్లలో మోగింది. దీంతో దొంగ ఆందోళనకు గురై.. ఏటీఎం బయట డోర్‌ను మూసేశాడు. డోర్‌ను మూసేసి మరలా తీయడానికి ప్రయత్నించగా.. డోర్ తెరుచుకోలేదు. తాను తీసిన గోతులో తానే పడ్డానని అనుకున్న దొంగ తలుపు తీయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఏటీఎంలోని మెటల్ ట్రేతో కొట్టినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. అనంతరం అదే మెటల్ ట్రేతో ఏటీఎంను కొట్టినప్పటికీ.. డబ్బులు ఎలా తీసుకోవాలనేది దొంగకు అర్థం కాలేదు. గట్టిగా ప్రయత్నించిన తరువాత ఏటీఎం డోర్ ఓపెన్ అవడంతో.. దొంగ అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.

Video Source: TomoNews US

Related posts