telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడ్వాన్సు ఇస్తేనే వస్తా… మహేష్ కు షాకిచ్చిన శృతి హసన్

Shruti-Hassan

లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురు, హీరోయిన్ శృతి హాసన్ టాలీవుడ్ లో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. ఇటీవల కాలంలో శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే శృతి హాసన్ త్వరలోనే తన ప్రియుడిని వివాహమాడబోతోందని, అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదనే వార్తలు వచ్చాయి. శృతిహాసన్ తన ప్రియుడు మైఖేల్ కోర్సలేతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడుతుండడంతో పెళ్ళి వార్తలకు బలం చేకూరింది. అయితే శృతిహాసన్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదని, సినిమాలకు దూరంగా ఉంటున్నా అంటే… దానర్థం పెళ్లి అని లేదా అవకాశాలు రావట్లేదని కాదు… నాకు సినిమానే కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయి. వాటితో బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

తాజాగా మరాఠీ చిత్రాల దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ రూపొందిస్తున్న ఒక సినిమాలో శృతి హాసన్ ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. అంతకుముందే ఇచ్చిన షూటింగ్ డేట్ రోజున మహేష్ ఫోన్ చేసి శృతి హాసన్ ను షూటింగ్ కు రమ్మన్నాడట. అయితే శృతి హాసన్ మాత్రం నిర్మాతలతో ముందుగా మాట్లాడుకున్న ప్రకారం షూటింగుకు ముందే సగం అడ్వాన్సు ఇస్తేనే వస్తానని తేల్చి చెప్పిందట. దీంతో షాక్ తినడం దర్శకుడు మహేష్ మంజ్రేకర్ వంతయ్యింది. శృతి హాసన్ కు గతంలో పారితోషికం విషయంలో ఎదురైన అనుభవాలతోనే ఆమె ఇలా మాట్లాడి ఉంటుందని అంటున్నారు.

Related posts