telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రణరంగం” టీజర్

Ranarangam

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  “రణరంగం”. ఈ చిత్రంలో ‘గ్యాంగ్ స్టర్’ గా శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒకటి యువకుడిగా ఉండే పాత్ర, మరో షేడ్ మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా ఉంటుంది. ఈ పాత్ర కోసం శర్వా గడ్డం పెంచి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. ఈ చిత్రాన్ని దర్శకుడు సుధీరవర్మ రూపొందిస్తున్నారు. నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 2 న  చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Related posts