telugu navyamedia
సినిమా వార్తలు

చైతూ లవ్ స్టోరీపై సామ్ ట్విట్స్..

టాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్ కపూల్స్‏లలో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఒకటి. నాగచైతన్య సమంతల జంటకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నార‌ని అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Samantha Naga Chaitanya: Interestingly .. Sam tweets .. Have you checked  the rumors? | Actor nagachaitanya replies the samantha tweet on love story  moive trailer - Heytamilcinema

ఇక ఈ మధ్య సామ్.. ఒంటరిగానే గోవా ట్రిప్ వెళ్లడం..సోషల్ మీడియా ఖాతా నుంచి అక్కినేని పేరును తొలగించడం.. ఎమోషనల్ పోస్ట్స్ చేయడం వంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే సమంత ఇప్పుడు ఒంటరిగా ముంబైలో ఉండేందుకు ఫిక్స్ అయిందని, అక్కడికే మకాం మార్చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. 

Samantha Akkineni, Naga Chaitanya's Marriage is Not in Trouble; Here is Why  They Aren't Divorcing - IBTimes India

ఈ గాసిప్స్‌పై ఇంతవరకూ చై కానీ, శామ్ కానీ స్పందించకపోవడంతో నిజాంగానే విడిపోతున్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ ట్రైలర్ కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈ లవ్ స్టోరీ ట్రైలర్ పై సమంత పెట్టిన ట్వీట్ అనేక రూమర్స్‏కు ఎండ్ కార్డ్ వేసినట్లుగా తెలుస్తోంది. 

Samantha Akkineni asks fans 'My husband looks handsome no?' Naga Chaitanya  has an EPIC reaction to it | PINKVILLA

సాయిపల్లవిని ట్యాగ్ చేస్తూ.. విన్నర్.. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సాయిపల్లవి స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చింది. అయితే సామ్.. చైతూని ట్యాగ్ చేయకపోవడంతో అభిమానులలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

Samantha Akkineni Talks About Her Love Story With Husband Chaitanya |  Filmfare.com

లవ్ స్టోరీ ట్రైలర్ చూసిన నెటిజన్స్ అందరు నాగచైతన్య పర్ఫార్మెన్స్ ని ఒకరేంజిలో పొగిడేస్తున్నారు. నిజానికి ట్రైలర్ లో చైతు పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. లక్షలాది నెటిజన్స్ చైతుని పొగుడుతుంటే భార్య సామ్, భర్త గురించి ఒక్కమాటైనా చెప్పకపోవటం తాజాగా చర్చనీయాంశం అవుతుంది.

Love Story' trailer: All eyes on Samantha's SM handles - Telugu News -  IndiaGlitz.com

అయితే చైతుతో చెడింది కాబట్టే చైతన్య పేరు తీయకుండా సామ్ ట్వీట్ పెట్టిందని అంటున్నారు కొంద‌రు..నాగచైతన్య పెట్టిన ట్వీట్ కే సమంత స్పదించిందని.. అలాంటప్పుడు ప్రత్యేకంగా చైతు పేరు ఎందుకు తీస్తుంది.. అనవసరంగా తప్పుడు కామెంట్స్ చేయొద్దని  అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ట్వీట్‏తో తమపై వస్తున్న రూమర్స్‏కు చెక్ పెట్టారు నాగచైతన్య.

Related posts