telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి యూనియన్ నాయకుడి వెంట ఒక రాజకీయ పార్టీ: మంత్రి గంగుల

gangula kamalakar trs

తెలంగాణలో కోనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈ రోజు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. కార్మికులు యూనియన్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు అని మంత్రి అన్నారు. ప్రతి యూనియన్ నాయకుడి వెంట ఒక రాజకీయ పార్టీ ఉందనీ, వాళ్ల రాజకీయ భవిష్యత్తు కోసం కార్మికులను బలి పశువులు చేయాలని చూస్తున్నారన్నారు.

కార్మికులు పునరాలోచించి సమ్మె విరమించాలని ఆయన మీడియా ద్వారా వారికి విన్నవించారు. సమ్మె వల్ల ప్రజలు, విద్యార్థులు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అంటున్న బీజేపీ.. వారు అధికారంలో ఉన్న18 రాష్ట్రాల్లో ఎందుకు విలీనం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని కానీ.. ప్రభుత్వంలో విలీనం చేస్తామని కానీ సీఎం కేసీఆర్ ఏనాడు చెప్పలేదన్నారు. కొందరు యూనియన్ నాయకులు తమ స్వార్ధం కోసం సమ్మె చేస్తున్నారు తప్పా, కార్మికుల ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నారు.

Related posts