telugu navyamedia
సినిమా వార్తలు

హీరోతో డేటింగ్ పై స్పందించిన రెజీనా

Rejina

తెలుగులో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రెజీనా తమిళంలో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అయితే గత కొంతకాలంగా రెజీనా ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందనే వార్తలు ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం కాస్తా రెజీనా వరకు వెళ్లడంతో స్పందించిన ఆమె ఆ వార్తలను కొట్టి పారేస్తూ వివరణ ఇచ్చారు. ‘‘నా సహనటుల్లో ఒక వ్యక్తితో నేను డేటింగ్‌లో ఉన్నానని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్ని చూశా. ఇవన్నీ నిరాధారమైనవి తప్ప వాస్తవాలు కాదు. ప్రస్తుతం నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉందంటే అది నా వృత్తిపైనే. ఒకవేళ ఏ వ్యక్తి పైనైనా ప్రేమ ఉంటే నేనే మీకు నేరుగా చెబుతా. ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది’’ అని రెజీనా తెలిపింది.

Related posts