telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు సినిమా కోసం.. తమిళ ఛాన్స్ కు నో.. చెప్పిన .. రష్మిక

rashmika gave more importance to telugu

కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రష్మిక తెలుగులో ఛలో, గీతా గోవిందం రెండు సినిమాలు సూపర్ హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవదాస్ ఫలితం తేడా కొట్టినా ఆమె కెరియర్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక ఆ సినిమాలో కూడా మూతి ముద్దులతో ఆడియెన్స్ ను బుట్టలో వేసుకుంటుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం ఓ తమిళ సినిమాకు హ్యాండి ఇచ్చిందట రష్మిక.

తెలుగుతో పాటుగా తమిళ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రష్మిక, ఇళయదళపతి విజయ్ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. అయితే అంతకన్నా ముందు శివ కార్తికేయన్ డైరక్షన్ లో సినిమా ఛాన్స్ వచ్చింది. కార్తితో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న రష్మిక శివ కార్తికేయన్ సినిమాకు మాత్రం హ్యాండ్ ఇచ్చిందట. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి రష్మిక తప్పుకుందట. ఈ సినిమా నుండి రష్మిక తప్పుకోడానికి ముఖ్య కారణం మహేష్ సినిమానే అంటున్నారు. తెలుగులో సూపర్ స్టార్ అయిన మహేష్ సినిమా మిస్ అవడం ఇష్టం లేకనే రష్మిక .తమిళ సినిమా స్కిప్ చేసిందట. మహేష్ సినిమా క్లిక్ అయితే అమ్మడికి మరింత క్రేజ్ వచ్చినట్టే.

Related posts