telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

రను మొండల్ మేకప్ లుక్… వీడియో విడుదల

Ranu

ఇదివరకు రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడిన రణు మోండల్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ సింగర్. అయితే ఇటీవల దెయ్యంలా కనిపిస్తున్న ఆమె మేకప్ లుక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిపై నెటిజన్లు మామూలుగా ట్రోలింగ్ చేయలేదు. రణు మొండల్ కు మేకప్ వేస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబయికి చెందిన సంధ్యాస్ మేకోవర్ పార్లర్‌లోని ఆషి భగా, ఉజ్జవల్ దువా, విద్యా అనే ముగ్గురు బ్యూటీషియన్లు రణుకి ఇలా మేకప్ వేశారు. అందంగా అలంకరించుకుని కాన్పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఫొటోలో మేకప్ చాలా ఎక్కవగా వేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే రానూమండల్‌కు మేకప్ చేసిన ఆర్టిస్ట్ వీడియోను విడుదల చేసి నెటిజన్లకు సమాధానం చెప్పారు. ఈ వీడియోలో రానూ మండల్‌కు మేకప్ చేసిన విధానాన్ని చూపించారు. మేకప్ ఆర్టిస్ట్ సంధ్య ఎంతో ఓపికగా రానూ మండల్‌కు మేకప్ చేశారు. అయితే ఒక్క ఫొటో కారణంగా మేకప్ ఆర్టిస్ట్ కృషి వృథాగా మారింది. తాజాగా సంధ్య షేర్‌చేసిన రానూ మండల్ మేకప్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన సంధ్య ‘ఈ వీడియోను చూస్తే తాను ఎంత కష్టపడి మేకప్ చేశానన్నది తెలుస్తుందన్నారు. అయితే ఈ మేకప్ ఫొటోను ఎడిట్ చేసి, జోక్స్ వేస్తున్నారని, ఇది సరికాదని సంధ్య అన్నారు.

Related posts