telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా జీవితంలో తొలిసారి న‌టించిన వెబ్‌సిరీస్‌ “క్వీన్”

Queen

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్… దివంగ‌త న‌టి, మాజీ ముఖ్యమంత్రి జ‌య‌లలిత జీవిత నేప‌థ్యంలో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న విషయం విదితమే. ఇందులో ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో జ‌య‌ల‌లిత బాల్యాన్ని చూపిస్తూ, ట్రైల‌ర్‌ని డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌య‌ల‌లిత పాత్ర పోషిస్తున్న ర‌మ్య‌కృష్ణ ఫేస్ రివీల్ చేయ‌లేదు మేక‌ర్స్‌. ఇటీవల జ‌య‌లలిత గా ర‌మ్యకృష్ణ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. “క్వీన్” అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ రూపొందుతుండ‌గా, MX ప్లేయర్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తెలుగు, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ వెబ్ సిరీస్‌ని మ‌నం వీక్షించ‌వ‌చ్చు. ఈ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర పేరు శ‌క్తి. శ‌నివారం నుండి ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానున్న నేప‌థ్యంలో “నా జీవితంలో నేను తొలిసారి న‌టించిన వెబ్‌సిరీస్‌. నేను పోషించిన శ‌క్తి క్యారెక్ట‌ర్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైంది” అంటూ ర‌మ్య‌కృష్ణ ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజ‌న్స్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related posts