telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా”లో రామ్ చరణ్ పాత్ర ?

Ram-Charan

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. సుమారు పది పదిహేనేళ్లుగా చిరంజీవి చేయాలనుకుంటున్న కలల చిత్రం “సైరా నరసింహారెడ్డి”. ఇందులో నాగబాబు కుమార్తె నిహారిక ఓ పాత్ర చేశారు. చిరు పెద్ద కుమార్తె సుష్మిత చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌లో ఒకరిగా పని చేశారు. “సైరా…”లో రామ్‌చరణ్‌ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తే బావుండేదని అభిమానులు ఆశ పడ్డారు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం “ఖైదీ నంబర్‌ 150″లో తండ్రితో కలిసి ఆయన “అమ్మడూ… లెట్స్‌ డూ కుమ్ముడు”లో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. నిజానికి “సైరా”లో రామ్‌చరణ్‌ చేత ఓ పాత్ర చేయించాలని చిరంజీవి, చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి అనుకున్నారు. విశ్రాంతికి ముందు వచ్చే పోరాట ఘట్టాల్లో షేర్‌ఖాన్‌ అని ఒక పాత్ర ఉంది. “రంగస్థలం” కోసం గడ్డం బాగా పెంచిన చరణ్‌ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని చిరు, దర్శకుడు భావించారు. మళ్లీ ఏమైందో ఏమో… స్ర్కిప్ట్‌ దశలోనే ఆ పాత్రను తీసేశారు. లేదంటే… “సైరా”లో చిరంజీవి, రామ్‌చరణ్‌ను వెండితెరపై ప్రేక్షకులు చూసేవారు.

Related posts