telugu navyamedia
news telugu cinema news

ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి మరో కొత్త ప్లాన్…

RRR

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు వాళ్ళే  కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న చాలా  మంది ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రలు చేయడం, ఈ సినిమాకి దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్‌ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇతర భాషల నటులు కనిపించనున్నారు. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని, అలియా భట్, ఒలీవియా మోరిస్ లాంటి స్టార్ నటీనటులు మరికొన్ని ప్రధాన పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. అయితే ఈ సినిమాకు మరింత సందడి చేకూర్చేందుకు జక్కన్న మరో కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ మరికొన్ని భాషల్లో రూపొందుతోంది. అయితే ఈ సినిమాకి ఏభాషలో ఆ భాష చిత్రపరిశ్రమలో ప్రముఖుల చేత వాయిస్ చెప్పించాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నారట. ఇదూ విధంగా నాచురల్ స్టార్‌ నానీ సనిమా ఈగకు చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ కోసం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, హిందీలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..ఈ విధంగా ఈ భాషకు ఆ భాషలో స్టార్ హీరోల చేత సినిమా పాత్రల కథలను పరిచయం చేయించనున్నారని సమాచారం. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి మొదలైంది. ప్రేక్షకుల ముందుకు 2021లో రానుందనదని చిత్ర యూనిట్ తెలిపింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది

Related posts

డెఫినెట్‌గా ‘ఎంతవారలైనా’ పెద్ద హిట్‌ అవుతుంది – నిర్మాత

ashok

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ : .. భారత్ బ్యాటింగ్..

vimala p

దిశ ఎన్కౌంటర్ .. అమెరికా లో … ప్రసారం…

vimala p