telugu navyamedia
news telugu cinema news

ప్రభాస్ తో రాజమౌళి మరో సినిమా…

rajamouli

దర్శక ధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వీరు కలిసి చేసిన మూడు సినిమాలు ఛత్రపతి, బాహుబలి, బాహుబలి2 లు భారీగా హిట్ అయ్యాయి. ఛత్రపతి తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తే బాహుబలి దేశంలోనే రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఈ సినిమా తరువాతే ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది. అది ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేస్తారా అని అడుగగా. దానికి రాజమౌళి ‘వామ్మో..మళ్లీ ప్రభాస్‌తోనా. ఇప్పటికే బాహుబలి ఐదు సంవత్సారాలు చేశా. మళ్లీ అంటే జనాలు తలలు పట్టుకుంటార’ని అన్నారు. వెంటనే నవ్వుతూ అవి సరదాగా అన్నాను. ఓ మంచి కథ దొరికితే కచ్చితంగి ప్రభాస్‌తో మరో సినిమా చేస్తా. ప్రభాస్‌తో చేయడం నాకూ ఇష్టమే అన్నారు.  అయితే ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సహా పాన్ ఇండియా స్థాయి సినిమాను రూపొందిస్తున్నాడు. దీని తరువాత మమేష్‌తో సినిమా చేయనున్నాడు. చూడాలి మరి ఆ సినిమా ఎప్పుడు అనేది.

Related posts

“సాహో”కు ప్రభాస్ పారితోషికం తెలిస్తే షాక్…!

vimala p

అమెరికా పోలీసుల చేతిలో మరో నల్ల జాతీయుడు హతం

vimala p

స్టైలిష్ లుక్ లో సాయి ధరమ్ తేజ్… పుట్టినరోజు స్పెషల్

vimala p