telugu navyamedia
culture news trending

ఉన్మాదం, ఉగ్రవాదం

ఉన్మాదం, ఉగ్రవాదం
చేయి చేయి కలిపి
పయనిస్తున్న వేళ
జగాన జాగా కోసం
వేయి కనులతో
ఎదురుచూస్తోంది
శాంతి కపోతం!!
అగ్రదేశాలకు ఆధిపత్యం
అంతులేని వ్యసనం-
వర్ధమాన దేశాలకు
అది ఒక శాపం-
శాపమే కోపమై
పుట్టుకొచ్చిన ఈర్ష్యా,
ద్వేషాలే మతోన్మాదం
సీమాంతర ఉగ్రవాధం!!
మసకబారుతున్న
మానవత్వానికి
బలిఅవుతున్న
అబలల ఆక్రందనలే
ఉన్మాధానికి ఉదాహరణలు-
కామపిశాచాలు
చేసే వికటాట్టహాసాలే,
వినాశనానికి వేసే
విషబీజాలు!!
అశాంతికి నెలవైన
నేలపై నిలవలేక-
శాంతి మేఘూలకై
విహంగ విక్షణ చేస్తూంది,
స్వేత పారుతము,
పారుతున్న,
రుధిరప్రవాహాన్ని
తేలుతున్న దేహాలను
భీతిగా వీక్షిస్తూ!!

Related posts

సింగపూర్ కి .. విమానసేవలు రద్దు.. : ఏపీసీఎం

vimala p

 వర్క్‌ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!

Vasishta Reddy

వైసీపీలో చేరనున్న సినీ నటుడు అలీ!

vimala p