కాగ్ నివేదికలతోనే బయటపడ్డ 2జీ, బొగ్గు స్కాంలు
ఆ దెబ్బతోనే కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
ఛార్టెట్ అకౌంటెంట్లు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, కాగ్ ఇచ్చిన నివేదికలతోనే 2జీ స్కాం, బొగ్గు స్కాంలు బయటపడ్డాయని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అడ్రస్సే గల్లంతైన విషయాన్ని గుర్తు చేశారు.
ఐసీఏఐ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. సీఏ పట్టభద్రుల ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ దేశ ఆర్దిక ప్రగతిని బ్రాండ్ అంబాసిడర్లు…. నవ భారత జాతి నిర్మాతలు సీఏలని అభివర్ణించారు. తమ క్లయింట్ల విషయంలో నిజాయితీగా పనిచేయాలని, లాభాలొచ్చినా, నష్టాలొచ్చినా వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం సీఏలపై ఉందన్నారు.