telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అవగాహన ప్రేమ అంతరంగం ప్రేమ

ప్రేమించడం ప్రేమించబడటం గొప్పకాదు
ఆ ప్రేమ శాశ్వతంగా మన ప్రాణం పోయే వరకు
మనతో ఉండటం అసలైన ప్రేమ
అవసరాలకోసం అల్లుకు పోయేది కాదు ఫ్రేమ
ఆకర్షణ కాదు ప్రేమంటే
వయసుకాదు అందమూకాదు ప్రేమ
అంతరాత్మతో ముడి పడేది ప్రేమ
అవగాహన ప్రేమ అంతరంగం ప్రేమ
అంతస్తులతో ముడిపడేది కాదు ప్రేమ
అనుకువగా ఉండేది అర్ధం చేసుకునేది ప్రేమంటే
స్వార్ధంతో వంచన చేసేది కాదు ప్రేమంటే
ప్రాణాలు తీసేది అంతకంటే కాదు
కల కానిది కలకాలం కలిసుండేది నిజమైన ప్రేమ ….
………………………………………
ఏమి ఆశించని ప్రేమకు మరణం లేదు
స్వార్థంతో నిండిపోయిన ప్రేమకి జీవం ఉండదు
పవిత్రమైన ప్రేమ అజరామరం
అపవిత్రమైన ప్రేమ ఆహుతౌతుంది
అన్నింటికి మించి దైవం శాశ్వతం
అది తెలుసుకుంటే కాదు ఏది అశాశ్వతం

Related posts