telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమలో “మనం”…

maharani poetry corner
ప్రేమ కడలిలో అలలం –
 ప్రేమ నిఘంటువులో 
సజీవ పదాలం-
ప్రేమ తరువుకి 
పూచిన పువ్వులం-
ప్రేమ వాయువుల్లో 
పరిమళాలం-
“ప్రేమ” అనే రెండక్షరాలలో 
బతుకు పుస్తకాలం
ప్రేమ చిత్రాలం – 
భవిత లక్ష్యాలం –
విజయ పతాకలం –
మనం ప్రేమ జీవులం-
మనం ప్రేమకు సాక్ష్యాలం-
మనం ప్రేమలో పదిలం-
మనం ప్రేమ సృష్టికే పునాదులం –
ప్రేమ నిరంతర యోగం-
ప్రేమ కోరేది త్యాగం-
-అంశుమాలి, టెక్కలి

Related posts