telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఇదే

Saaho

“బాహుబలి”తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం “సాహో”. “రన్ రాజా రన్” ఫేం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న “సాహో” చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. “హాయ్ డార్లింగ్స్… ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి” అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. దీంతో “డార్లింగ్ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ ఏంటా?” అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇండిపెండెన్స్‌డే కానుకగా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. మే 21 నుంచి ప్రభాస్ సాహో ప్రమోషన్స్‌ని మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా సాహో న్యూ లుక్‌తో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియో‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ పోస్ట్ చేశారు.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీలు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్‌ను స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Related posts