telugu navyamedia
సినిమా వార్తలు

జగన్ ను సపోర్ట్ చేసినందుకు ఆ నిర్మాత సినిమాలోంచి తీసేశారు… : పోసాని

Posani

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికలలో వైఎస్ జగన్ కు తన మద్దతు తెలిపారు. మీడియా సమావేశాలలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు. తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ కు మద్దతు ఇవ్వడం వల్ల సినిమా ఆఫర్స్ బాగా తగ్గాయని, చంద్రబాబుని, టీడీపీని తిట్టానని కొన్ని సినిమాల నుంచి తనని తీసేశారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఓ చిత్రంలో నన్ను ఎంపిక చేసిన తర్వాత కూడా లిస్టులో నుంచి తన పేరు తీసేశారని పోసాని ఆరోపించారు. ఆ నిర్మాత అశ్విని దత్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో నాకు జగన్ నచ్చారు. కానీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా టీడీపీ మద్దతు దారులే ఉన్నారు. దీనివల్ల సహజంగానే తనకు అవకాశాలు తగ్గుతాయని పోసాని అన్నారు. ఇక చిత్ర పరిశ్రమని ఏపీకి తరలించాలనే ఆలోచన సరైనది కాదని, తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాలకు 45 శాతం షేర్ వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని పోసాని తెలిపారు. ప్రస్తుతం పోసాని అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఇక ఇటీవల కమెడియన్ పృథ్వీ కూడా జగన్ కు మద్దతు తెలపడంతో ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కొట్టి పారేశారు పృథ్వి.

Related posts