telugu navyamedia
news political Telangana

తెలంగాణలో నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్

counting election

తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో మూడు విడతలుగా నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీటీసీ, 2 గంటల వరకు జడ్పీటీసీల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్‌ ప్రక్రియను సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశార్రు.

సాయంత్రం 6 గంటల్లోగా స్ట్రాంగ్‌ రూముల్లోకి బ్యాలెట్‌ బాక్సులను తరలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు, 538 జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన 21,356 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాల్లో 978 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు.

Related posts

తదుపరి సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’: వర్మ

vimala p

లాడ్జ్ లో మంద కృష్ణ మకాం..అరెస్ట్ చేసిన పోలీసులు!

vimala p

కాలినడకన అంజన్న మొక్కుతీర్చుకున్న బీజేపీ ఎంపీ

vimala p