telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

chiranjeevi family

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి,  ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని  జగన్‌ నివాసానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.

Related posts