telugu navyamedia
crime news

పబ్జీ గేమ్ ఎఫెక్ట్ .. యువకుడు ఆత్మహత్య

Pubjee game boy death in hospital

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ యువకులు పబ్జీ గేమ్ కు బానిసగా మారుతున్నారు. ఎప్పుడూ చేతిలో సెల్ పట్టుకుని పిచ్చి వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఈ గేమ్‌కు బానిసలవ్వద్దు అంటూ అటు వైద్యులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇదే గేమ్‌కు బానిసలా మారిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగింది.

మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. గమనించిన తల్లిదండ్రలు గేమ్ ఆడవద్దంటు అతడిని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఆసనాలతో.. జీర్ణశక్తి వృద్ధి.. ఇలా…

vimala p

రెండవ టెస్ట్ లో… పట్టు బిగుస్తున్న ఆస్ట్రేలియా…

vimala p

వైసీపీ నేతలు కలలు కంటున్నారు: సోమిరెడ్డి

vimala p